బ్రహ్మోత్సవం కలగూరగంప కాదుగా?
on May 19, 2016

అందరికళ్లూ ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాపైనే. శ్రీమంతుడులా బ్రహ్మోత్సవం కూడా రికార్డులు సృష్టిస్తుందా, ఈ సమ్మర్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొంటుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో బ్రహ్మోత్సవం ఫలితం తేలిపోనుంది. అయితే వ్యవహారం చూస్తుంటే ఇదేదో కలగూర గంపలాంటి సినిమానేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. వంటగాళ్లు ఎక్కువైతే వంట పాడైపోయిందన్నది పాత సామెత. ఓ సినిమాకి రచయితల ప్రమేయం ఎక్కువ ఉన్నా.. అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. బ్రహ్మోత్సవం విషయంలోనూ అదే జరగబోతోందన్న భయాలు పట్టుకొన్నాయి.
ఎందుకంటే ఈసినిమాకి పనిచేసిన రచయితల లిస్టు చాంతాడంత ఉంది. బ్రహ్మోత్సవం కథకుడు శ్రీకాంత్ అడ్డాల. స్వతహాగా తన సినిమాకి మాటలు ఆయనే రాసుకొంటాడు. ఈసారి గణేష్ పాత్రతో కొన్ని సంభాషణలు రాయించారు. పరుచూరి బ్రదర్స్ కూడా యాడ్ అయ్యారు. అదీగాక.. ఖదీర్ బాబుని తీసుకొచ్చి కొన్ని సీన్లు రాయించారు. కృష్ణచైతన్య కూడా స్ర్కిప్టులో భాగం పంచుకొన్నాడు. అలా.. రచయితలు తలో చేయి వేసి ఈ సినిమాకి కెలికేశారు. ఆ ప్రభావం రిజల్ట్‌పై ఎంత ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. తలో మంచి ఆలోచన చేసి.. బ్రహ్మోత్సవంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దితే ఫర్వాలేదు. ఈ రథాన్ని ఒకరు ఒకవైపు, మరొకరు మరోవైపు లాగితేనే ప్రమాదం. మరి.. ఏం జరిగి ఉంటుందో??
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



