ఊహకు మించి 'ఖిలాడి' టీజర్!
on Apr 12, 2021

రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తోన్న 'ఖిలాడి' ఫిల్మ్ టీజర్ వచ్చేసింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానులను ఆనందపరిచే ఉద్దేశంతో వచ్చిన ఈ టీజర్ ఊహకు మించి ఎట్రాక్టివ్‌గ్, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 'రాక్షసుడు' లాంటి హిట్ మూవీ తర్వాత రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రవితేజ చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. వాటిలో జైలు ఖైదీ గెటప్ కూడా ఉంది.
.jpg)
టీజర్ ప్రకారం క్రైమ్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రమేశ్ వర్మ రూపొందిస్తున్నాడనేది స్పష్టం. ఇప్పటిదాకా క్యాస్టింగ్‌లో హీరో రవితేజ, హీరోయిన్లు మీనాక్షి చౌధరి, డింపుల్ హయతిలను మాత్రమే మేకర్స్ బయటపెట్టారు. టీజర్‌లో యాక్షన్ కింగ్ అర్జున్, అనసూయ, రావు రమేశ్, మురళీ శర్మ, ముఖేశ్ రుషి, వెన్నెల కిశోర్ లాంటి పేరుపొందిన నటులు కనిపించారు.

టీజర్ చివరలో డింపుల్ హయతిని రవితేజ చంపుతున్నట్లుగా చూపించడం ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలక ఘట్టంగా భావించవచ్చు. ఆ సీన్ తర్వాత రవితేజ, "If you play smart without stupid emotions you are unstoppable." అంటూ ఇంగ్లిష్‌లో డైలాగ్ చెప్పి, కన్నుగొట్టాడు. అతడే ఖిలాడి అన్నమాట.

అడుగడుగునా ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ఒళ్లు జలదరింపజేసే యాక్షన్ ఎపిసోడ్స్, హీరో హీరోయిన్ల రొమాంటిక్ సీన్స్‌తో 'ఖిలాడి' టీజర్ ఊహకు మించి ఆకట్టుకుంటోంది. చక్కని క్యాస్టింగ్‌తో తయారవుతున్న ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఎస్సెట్ కానున్నది బీజియంను బట్టి అర్థమైపోతోంది.

సుజిత్ వాసుదేవ్, జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌తో కనిపిస్తోంది. రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు సమకూర్చిన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మరో బలం అని ఆశించవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా ఓ ఇంట్రెస్టింగ్ మూవీని రవితేజ-రమేశ్ వర్మ జోడీ ఆడియెన్స్‌కు ప్రెజెంట్ చేయబోతోందని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
.jpg)
మే 28న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు కోనేరు సత్యనారాయణ, జయంతీలాల్ గడ సన్నాహాలు చేస్తున్నారు. 'క్రాక్' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ చేస్తున్న సినిమా కావడంతో బిజినెస్ వర్గాల్లో కూడా 'ఖిలాడి'పై మంచి అంచనాలే ఉన్నాయి.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



