అఘోరా లుక్ తో బాలయ్య సర్ ప్రైజ్
on Apr 12, 2021

బ్లాక్ బస్టర్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కాంబినేషన్.. నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది. `సింహా`, `లెజెండ్`తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్.. త్వరలో మరో యాక్షన్ డ్రామాతో పలకరించబోతోంది. గత రెండు సినిమాల్లాగే ఇందులోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారు. అందులో ఒకటి ఐఎఏస్ రోల్ కాగా.. మరొకటి అఘోరా అని టాక్. కాగా, ఇప్పటికే మొదటి పాత్రకు సంబంధించి లుక్ ని రివీల్ చేసిన యూనిట్.. అతి త్వరలో రెండో పాత్ర లుక్ తో సర్ ప్రైజ్ చేయబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. ఉగాది సందర్భంగా `BB 3` తాలూకు టైటిల్ రోర్ ని ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12. 33 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ద్వారక క్రియేషన్స్ ఆదివారం ట్విట్టర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ పోస్టర్ లోనే బాలయ్య రెండో పాత్రకి సంబంధించిన లుక్ ని రివీల్ చేస్తారట. మరి.. ఈ లుక్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఏప్రిల్ 13 వరకు వేచిచూడాల్సిందే.
`BB 3`లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



