చిరు, బాలయ్య.. ముందు గుట్టు విప్పేదెవరు?
on Dec 27, 2016

ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య సినిమాలు పోటీ పడబోతున్నాయన్న విషయంలోక్లారిటీ వచ్చేసింది. పొంగల్ వార్ ఈ హీరోల మధ్యే అనేది డిసైడ్ అయ్యింది. అయితే.. అభిమానుల్లో ఒక్కటే కన్‌ఫ్యూజన్. ఈ రెండు సినిమాలూ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? ముందు చిరు వస్తాడా, బాలయ్యనా? లేదంటే రెండూ ఒకేరోజు విడుదల అవుతాయా? వీటిపై ఇంకా క్లారిటీ రాలేదు. గౌతమి పుత్ర శాతకర్ణి జనవరి 12న వస్తుందని ముందే చెప్పారు. అయితే ఆ ప్లాన్ మారబోతోందేమో అనిపిస్తోంది. అందుకే ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో డేట్ విషయంలో ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఖైదీ నెం.150 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన తరవాత.. అప్పుడు తీరిగ్గా గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ డేట్ చెబుదామని చిత్రబృందం ఎదురుచూస్తోంది. మరోవైపు చిరు సినిమాదీ అదే పరిస్థితి. గౌతమి పుత్ర రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక అప్పుడు.. తమ సినిమా విడుదల తేదీ ప్రకటిద్దామని చూస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి 12న వస్తే, ఖైదీ నెంబర్ 150 ఒక రోజు ముందే అంటే 11నే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ శాతకర్ణి 11న వస్తే, అప్పుడు చిరు సినిమా 12న విడుదల అవుతుంది. రెండూ ఒకే రోజు వచ్చే ఛాన్సులూ ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏదో ఓ సినిమా ముందడుగు వేసి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే తప్ప ఈ కన్‌ఫ్యూజన్‌కి పుల్ స్టాప్ పడదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



