జీవిత కామెంట్ 'జీవిత' కాలం లేటు..!
on Dec 27, 2016

నేను ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు.. అనేది ఫ్యామస్ కొటేషన్! మరీ అంత లేటయితే ఎట్టా.. అసలే ఇది ఫాస్ట్ యుగం. అన్నీ... ఫాస్ట్ ఫాస్ట్‌గా జరిగిపోవాల్సిందే. ప్రపంచంతో వేగంగా పరిగెట్టాల్సిందే. అయితే ఈ విషయంలో నటి, దర్శకురాలు జీవిత చాలా లేటు. ఈమధ్య జీవిత ఓ స్టార్ హీరో చెప్పిన డైలాగులపై ఘాటైన కామెంట్లు చేసింది. జీవిత విమర్శ సరైనదైనా.. మరీ లేటుగా స్పందించడంతో జీవిత కామెంట్‌కి విలువే లేకుండా పోయింది. `టెంపర్`లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌ని ఉటంకిస్తూ... `కుక్కలే కాదు.. మేం కూడా క్రాసింగ్‌కి వచ్చాం` అనే డైలాగ్‌ని తప్పుపట్టింది జీవిత. ఓ స్టార్ హీరోతో ఇలాంటి డైలాగ్ చెప్పిస్తారా? అంటూ మండిపడింది.
నిజమే. పూరి మరీ టూమచ్‌గా రాసిన డైలాగ్ ఇది. అప్పట్లోనే ఈ డైలాగ్‌ని విమర్శకులు ఏకి పడేశారు. మరి జీవిత అప్పుడేం చేసిందో..? ఇంత కాలం ఎందుకు నోరు విప్పలేదో..?? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కడొచ్చాడు డైరెక్టర్ సూరజ్ కూడా హీరోయిన్లపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఆయన అలా చేశాడో లేదో.. నయన తార ఇలా స్పందించేసింది. ఆ దర్శకుడికి లెఫ్టూ రైటూ ఇచ్చేసింది. చివరికి ఆదర్శకుడు దిగి వచ్చి `సారీ` చెప్పి ఆ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాడు. అంత ఫాస్ట్‌గా ఉండాల్సిన జీవిత.. మరీ లేటుగా స్పందించింది. దీనిపై పూరిగానీ, ఎన్టీఆర్‌గానీ స్పందిస్తారో, లేదో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



