ఇది బోయపాటి వారి బిస్కెట్..!
on Dec 27, 2016

మాస్ పల్స్ పట్టేసిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ముందుంటాడు. యాక్షన్ సీన్లని హీరోయిజం ఎలివేట్ చేస్తూ తీయడంలో .... బోయపాటి సాటి రారెవ్వరూ. మరో విషయంలోనూ బోయపాటి ఘనా పాటే. అదే.. భజన విషయంలో. ఏ ఫంక్షన్‌కి వెళ్లినా.. తనదైన స్టైల్లో మాస్ మసాలా మాటలతో అలరిస్తుంటాడు బోయపాటి. గౌతమి పుత్ర శాతకర్ణిలో అదే జరిగింది. అవ్వడానికి ఇది బాలయ్య పోగ్రాం అయినా.. బాబు భజనకే తన స్పీచ్ అంతా వృథా చేశాడాయన. అమరావతి నిర్మాణం కోసం ఆంధ్ర ప్రదేశ్ సీఎమ్‌గా బాబుని దేవుడే నియమించాడు అంటూ స్పీచ్‌లో బోల్డన్ని అతిశయోక్తులు వాడాడు. బాలయ్య కోసమే ఈ ఫంక్షన్‌కి వచ్చానని, అందుకోసం షూటింగ్‌కి క్యాన్సిల్ చేసుకోవాల్సివచ్చిందని ఏవేవో చెప్పుకోచ్చాడు. అందరూ పనులు మానుకొనే వెళ్లారు లేవయ్యా బోయపాటి.. అంటూ.. బోయపాటిపై అప్పుడే ఓ వర్గం సెటైర్లు వేసేస్తోంది. అయినా బోయపాటి సభల్లో మాట్లాడే స్టైలే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మైకు పట్టుకోవడం దగ్గర్నుంచి నిలబడే స్టైల్ వరకూ హడావుడి పడిపోతుంటాడు. తనదైన ప్రత్యేక ముద్ర చూపించుకోవాలని తాపత్రయ పడిపోతుంటాడు. ఆ తాపత్రయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కోసారి అర్థం కాకుండా పోతోంది. గౌతమి పుత్ర శాతకర్ణి ఫంక్షన్‌కి వెళ్లి సినిమా కోసం కాకుండా.. ఆఫంక్షన్‌కి తనలానే అతిథిగా వచ్చిన మరో వ్యక్తి గురించి మాట్లాడాడంటే... బోయపాటి స్పీచులో క్లారిటీ ఏమిటో అర్థమైపోతోంది. ఇటీవల కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్ని బోయపాటి శ్రీనుతన డైరెక్షన్‌లో నడిపిస్తున్నాడు. ఆ అనుబంధం పెంచుకోవడానికి, బాబుకి మరింత దగ్గరవ్వడానికి బోయపాటి బిస్కెట్లు వేస్తున్నాడేమో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



