`కేజీఎఫ్: ఛాప్టర్ 2`.. ఆ విషయంలో `ఛాప్టర్ 1`కి మించి..
on May 5, 2021
ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్న పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ లో `కేజీఎఫ్: ఛాప్టర్ 2` ఒకటి. రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ `కేజీఎఫ్: ఛాప్టర్ 1`కి రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీనిధి శెట్టి నాయికగా కొనసాగుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ అదనపు ఆకర్షణగా నిలవనున్నారు. అన్నీ అనుకూలంగా ఉంటే.. ముందుగా ప్రకటించిన జూలై 16న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. టీజర్ తో `ఛాప్టర్ 1`ని మించి `ఛాప్టర్ 2` ఉండబోతోందనే సంకేతాలు అందించి.. సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది యూనిట్. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. నిడివి విషయంలోనూ `ఛాప్టర్ 1` కంటే మిన్నగా `ఛాప్టర్ 2` ఉండబోతోందట. 155 నిమిషాల ( 2 గంటల 35 నిమిషాలు) పాటు `ఛాప్టర్ 1` సాగితే.. 172 నిమిషాల (2 గంటల 52 నిమిషాల) నిడివితో `ఛాప్టర్ 2` తెరకెక్కిందని సమాచారం. మరి.. రన్ టైమ్ పై వస్తున్న కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read