32 ఏళ్ళ దేవరకొండకి జోడీగా 37 ఏళ్ళ కత్రినా కైఫ్?
on May 5, 2021

`పెళ్ళిచూపులు`, `అర్జున్ రెడ్డి`, `గీత గోవిందం` వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగునాట స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. అనతికాలంలోనే `యూత్ ఐకాన్` అనిపించుకున్న విజయ్.. `అర్జున్ రెడ్డి` పుణ్యమా అని దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే ప్రస్తుతం `లైగర్` అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేతో జట్టుకట్టాడు విజయ్.
ఇదిలా ఉంటే.. `లైగర్` నిర్మాణ దశలో ఉండగనే ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడట మిస్టర్ దేవరకొండ. అంతేకాదు.. ఈ సినిమాలో `గ్లామర్ ఐకాన్` కత్రినా కైఫ్ నాయికగా నటించబోతోందని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ నెల 9తో విజయ్ 32 ఏళ్ళు పూర్తిచేసుకోనుండగా.. మిస్ కైఫ్ కి ప్రస్తుతం 37 ఏళ్ళు. మొత్తానికి.. తనకంటే అన్ని విధాలా (అటు నటనలోనూ, ఇటు వయసులోనూ) సీనియర్ అయిన కత్రినాతో జోడీకడుతూ దేవరకొండ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతున్నాడు. త్వరలోనే విజయ్, కత్రినా జంటగా నటించే సినిమాకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



