అత్యాచారం ఆరోపణలతో డైరెక్టర్ అరెస్ట్
on Mar 7, 2022

అత్యాచారం ఆరోపణలపై మలయాళం దర్శకుడు లిజు కృష్ణను ఆదివారం కేరళలోని కన్నూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న 'పదవేట్టు' మూవీ డైరెక్టర్ అయిన లిజు (36) తనపై అత్యాచారం చేశాడంటూ కక్కనాడ్‌లోని ఇన్ఫోపార్క్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కన్నూర్లోని మట్టన్నూర్‌లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. లిజు అరెస్ట్‌తో 'పదవేట్టు' షూటింగ్ అర్ధంతరంగా నిలిచిపోయింది.
డిసెంబర్ 2020 నుంచి జూన్ 2021 వరకు ఆరు నెలల కాలంలో పలు సందర్భాల్లో లిజు తనను లైంగికంగా వేధించాడని సదరు మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఆమెతో లిజు సహజీవనం చేస్తూ వచ్చాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.
మంజు వారియర్, నివిన్ పాలీ లాంటి టాప్ యాక్టర్స్ నటిస్తోన్న 'పదవేట్టు' మూవీని ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ఆలోచన. లిజు అరెస్ట్ కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



