Home

»

Latest News

మంచు విష్ణు సినిమాలో సన్నీ లియోన్.. తగ్గేదేలే

Mar 07, 2022

కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్లతో 'డి & డి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా విష్ణు మరో సినిమాని ప్రకటించాడు. ఈ సినిమాలో తాను 'గాలి నాగేశ్వరరావు' పాత్రలో కనిపించనున్నానని తెలుపుతూ ఆ క్యారెక్టర్ గెటప్‌ని ఒక స్కెచ్ రూపంలో రిలీజ్ చేశాడు విష్ణు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా నటిస్తోంది.

మంచు విష్ణు సినిమాలో తాను నటిస్తున్నట్లు సన్నీ లియోన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో ఆమె రేణుక పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు ఆమె తన క్యారెక్టర్ గెటప్‌ని ఒక స్కెచ్ రూపంలో విడుదల చేసింది. సన్నీ లియోన్ గతంలోనూ మంచు ఫ్యామిలీ సినిమాలో అలరించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' సినిమాలో సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు విష్ణు సినిమాలో రేణుకగా అలరించనుంది. ఈ సినిమాలో మరో బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా నటించనుంది. ఈ సినిమాలో స్వాతిగా పాయల్ కనిపించనుంది.

ఈషాన్ సూర్య డైరెక్ట్ చేసే ఈ మూవీ అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై  తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్‌ప్లే అందించ‌డంతో పాటు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా కె. నాయుడు వ‌ర్క్ చేస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఓ ఎస్సెట్ కానున్న‌ది. ఈ సినిమాకి జి.నాగేశ్వరరెడ్డి స్ర్కిఫ్ట్ అందించగా, నందు డైలాగ్స్ రాశారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com