ప్రముఖ హీరోకి కీర్తి సురేష్ క్షమాపణలు.. కారణం తెలిస్తే షాక్ గ్యారంటీ
on Oct 13, 2025

అందం, అభినయం కలగలిసిన నటీమణుల్లో ప్రముఖ హీరోయిన్ 'కీర్తి సురేష్'(Keerthy suresh)కూడా ఒకరు. కేరళ కి చెందిన కీర్తి బాల్యం నుంచే మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతు, రామ్ పోతినేని(Ram Pothineni)హీరోగా వచ్చిన 'నేను శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలజ క్యారక్టర్ లో క్యూట్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి, మొదటి చిత్రంతోనే ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ తర్వాత చేసిన నేను లోకల్, అజ్ఞాతవాసి,సర్కారివారి పాట, దసరా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలు కూడా కీర్తి రేంజ్ ని పెంచాయి. మహానటి తో అయితే చెప్పక్కర్లేదు, ఎవర్ గ్రీన్ లెజండ్రీ యాక్ట్రస్ సావిత్రిగారి క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించి, సావిత్రి గారిని మన కళ్ళ ముందుకు మళ్ళీ సజీవంగా నిలబడేలా చేసింది. గత ఏడాది డిసెంబర్ 12 న 'ఆంథోనీ తటిల్' నిప్రేమ వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
ప్రముఖ ఓటిటి ఛానల్ జీ 5 లో జగపతి బాబు(Jagapathi Babu)వ్యాఖ్యాతగా 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షో(Jayammu NischayammuRaa Talk show) స్ట్రీమింగ్ అవుతు వస్తుంది. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ కి కీర్తి సురేష్ గెస్ట్ గా వచ్చింది. అందులో ఆమె మాట్లాడుతు అంథోని నేను పదిహేను సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాం. ఇంట్లో వాళ్ళకి నాలుగు సంవత్సరాల క్రితం చెప్పాను. వాళ్ళు వెంటనే ఓకే అన్నారు. ఇంట్లో వాళ్లకి చెప్పడం కంటే ముందే జగపతిబాబు గారికి చెప్పాను. ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి నా ప్రేమ గురించి తెలుసు. అలాంటి తక్కువ మందిలో జగపతి బాబు కూడా ఒకరు. జగపతి బాబు గారిని నమ్మాను కాబట్టే చెప్పాను. కానీ ఆయన్ని పెళ్ళికి పిలవలేదు అని చెప్పింది. అనంతరం ఈ విషయంపై జగపతిబాబుని క్షమాపణ కూడా కోరింది.
జగపతి బాబు, కీర్తి సురేష్ లు గుడ్ లక్ సఖి లో కలిసి నటించారు. సదరు చిత్ర కథ ప్రకారం కీర్తి సురేష్ కి కోచ్ గా జగపతి బాబు కనపడ్డాడు. నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన మిస్ ఇండియాలో కూడా కలిసి చెయ్యడంతో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే కీర్తి సురేష్ గత ఏడాది బేబీ జాన్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.ఈ ఏడాది ఆగస్టులో తనే ప్రధాన పాత్రలో 'రివాల్వర్ రీటా' అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో కలిసి రౌడీ జనార్ధన్ లో చేస్తుంది. ఇక కీర్తి తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్. మళయాళంతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు వంద చిత్రాల వరకు హీరోయిన్ గా చేసింది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో 'పున్నమి నాగు' లో కూడా జత కట్టి అలరించింది.తండ్రి సురేష్ మలయాళంలో అనేక హిట్ చిత్రాలని నిర్మించిన నిర్మాత.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



