'బాహుబలి'ని దాటేసిన 'కాంతార చాప్టర్ 1'.. ఆ తప్పు చేయకపోతే మరోలా ఉండేది!
on Oct 13, 2025

'కాంతార'కి ప్రీక్వెల్ గా రూపొందిన 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. పదకొండు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. దీంతో 'బాహుబలి-1' ఫైనల్ కలెక్షన్స్ ని ఈ మూవీ క్రాస్ చేసింది. (Kantara Chapter 1)
దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన 'కాంతార చాప్టర్ 1'.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ.. భారీ వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్ లో రూ.335 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.509 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఇక తాజాగా సెకండ్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. 11 రోజుల్లో ఈ మూవీ రూ.655 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో.. మరి వారం రోజుల పాటు 'కాంతార చాప్టర్ 1' జోరు కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో ఈ మూవీ ఫుల్ రన్ లో రూ.800 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.

సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా 'కాంతార చాప్టర్ 1' నిలిచింది. ప్రభాస్ నటించిన 'బాహుబలి-1', 'సలార్-1' సినిమాలు ఫుల్ రన్ లో రూ.600 కోట్ల క్లబ్ లో చేరగా.. ఇప్పుడు వాటి సరసన 'కాంతార చాప్టర్ 1' చేరింది. త్వరలోనే రూ.700 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లి, రజినీకాంత్ '2.O' సరసన కూడా చేరనుంది.
సౌత్ సినిమాల్లో ఇప్పటిదాకా 'బాహుబలి-2', 'పుష్ప-2', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2', 'కల్కి' మాత్రమే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరాయి. ఆ ఐదు సినిమాల సరసన 'కాంతార చాప్టర్ 1' కూడా చేరుతుందనే అంచనాలు మొదట్లో ఉన్నాయి. అయితే విడుదలకు ముందు భారీ ప్రమోషన్స్ చేయకపోవడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిందని.. లేదంటే, ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



