బీరు సీసాలతో 'బిగ్ బాస్ 3' విజేతను చితక్కొట్టారు..
on Mar 5, 2020

'బిగ్ బాస్ 3' విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ క్షేమంగా ఉన్నాడని, అతడికి ఏమీ కాలేదని మరో గాయకుడు నోయెల్ సేన్ ట్వీట్ చేశారు. మరోవైపు రాహుల్ కూడా తనకు ఏమీ కాలేదని వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే... అతడిని బీరు సీసాలతో చితక్కొట్టినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు చూస్తే తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే...
రాహుల్ సిప్లిగంజ్ మరికొందరు స్నేహితులు కలిసి బుధవారం రాత్రి భాగ్యనగరంలోని ఒక పబ్బుకు వెళ్లారు. అదే పబ్బులో నగరానికిిిి చెందిన ఒక ఎమ్మెల్యే బంధువులు కూడా ఉన్నారు. ఇరు వర్గాల మధ్య సమస్య తలెత్తడంతో గొడవ జరిగింది. ఆ గొడవలో బీరు సీసాలతో రాహుల్ ని గట్టిగా కొట్టారు. అతడిని కొడుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. ఒక వీడియోలో పోలీసు గొడవ ఆపడానికి ప్రయత్నించినట్లు అర్థమవుతుంది. కానీ ఎమ్మెల్యే బంధువులు బీరు సీసాలతో కొట్టడమే కాకుండా రాహుల్ ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. గట్టిగా కొట్టారు.
గొడవకు కారణం ఏంటని దానిపై ఇరు వర్గాల నుండి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. తనతో వచ్చిన అమ్మాయి తో అసభ్యంగా ప్రవర్తించడంతో ఎమ్మెల్యే బంధువులను హెచ్చరిస్తే... తనపై దాడి చేశారని రాహుల్ చెబుతున్నారట. తమ బంధువులలో ఒక అమ్మాయి తో రాహుల్ అతని స్నేహితులు అమర్యాదగా ప్రవర్తించడాన్ని తో దాడి చేశామని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నట్లు సమాచారం. అయితే... రాహుల్ వెంట ఉన్న యువతి ఎవరు అనేది మిస్టరీగా మారింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో ఆమె వివరాలు బయటకు రానివ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



