ఆహాలో నవంబర్ 18న స్ట్రీమింగ్ అవుతున్న 'సర్దార్'
on Nov 12, 2022

కార్తీ టైటిల్ రోల్ చేయగా ఘన విజయం సాధించిన సినిమా 'సర్దార్'. స్పై థ్రిల్లర్‌గా ఈ మూవీని డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ రూపొందించాడు. నవంబర్ 18న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. రాశీ ఖన్నా, రాజీషా విజయన్, చంకీ పాండే, లైలా ప్రధాన పాత్రల్లో నటించారు.
'సర్దార్'లో పబ్లిసిటీ కోసం పాకులాడే పోలీస్ ఆఫీసర్ విజయ్ ప్రకాశ్‌గా కార్తీ కనిపిస్తాడు. కనిపించకుండా పోయిన తండ్రి కారణంగా దేశద్రోహి కొడుకు అనే చెడ్డపేరును మోస్తుంటాడు. సమీర (లైలా) అనే సోషల్ వర్కర్ నీటి వనరుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటుంది. దేశాన్ని ప్రమాదంలో పడేసే అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజల్ని మోసంచేసే ఒక వెబ్‌కు సంబంధించిన వివరాల్ని సేకరించడానికి విజయ్ ప్రకాశ్ ప్ర్యత్నిస్తాడు. దుర్మార్గుడైన బిజినెస్‌మేన్ రాథోడ్ (చంకీ పాండే)ని, అతడి నీచమైన ప్లాన్స్‌ని ఆపగలిగే ఏకైక వ్యక్తి.. విజయ్ తండ్రి సూపర్ స్పై అజ్ఞాతంలో ఉంటాడు. అతను ఏం చేశాడనేదే మిగతా సినిమా.
సూపర్ స్పైగా, విజయ్ ప్రకాశ్‌గా కార్తీ డబుల్ రోల్ చేశాడు. 'ఖైదీ'లో చేసిన ఢిల్లీ క్యారెక్టర్ నుంచి 'సర్దార్' దాకా కార్తీ వైవిధ్యమైన పాత్రలతో, యాక్షన్ మూవీస్‌తో ఆడియెన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నాడు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆయన్ని ఆదరిస్తున్నారు. 'సర్దార్'ను నవంబర్ 18న ఓటీటీ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేస్తూ కార్తి ఫ్యాన్స్‌కి సంబరాన్ని తెస్తోంది ఆహా.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



