యశోద కలెక్షన్స్.. మొదటి రోజుని మించి రెండో రోజు!
on Nov 13, 2022
.webp)
సమంత తాజా చిత్రం 'యశోద' నవంబర్ 11న విడుదలై మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టాక్ కి తగ్గట్టే మంచి కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.63 కోట్ల షేర్ వసూలు చేసిన యశోద రెండోరోజు రూ.1.76 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.3.39 కోట్ల షేర్ సాధించింది. ఇక తమిళనాడులో రూ.38 లక్షల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.45 లక్షల షేర్, ఓవర్సీస్ లో రూ.1.54 కోట్ల షేర్ తో.. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.5.76 కోట్ల షేర్(12 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా యశోద వసూళ్లు మొదటి రోజు రూ.2.94 కోట్ల షేర్(5.90 కోట్ల గ్రాస్), రెండో రోజు రూ.2.82 కోట్ల షేర్(6.10 కోట్ల గ్రాస్) గా ఉన్నాయి.
వరల్డ్ వైడ్ గా 'యశోద' థియేట్రికల్ బిజినెస్ రూ.20 కోట్లకు పైగా జరిగినట్టు మొదట వార్తలొచ్చాయి. కానీ నిజానికి చాలా ఏరియాల్లో సొంతంగా విడుదల చేశారని, బిజినెస్ వాల్యూ రూ.12 కోట్లని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే రెండు రోజుల్లోనే రూ.5.76 కోట్ల షేర్ రాబట్టిన యశోద బ్రేక్ ఈవెన్ సాధించడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



