అన్ని చోట్లా 'యశోద'కు పాజిటివ్ టాక్.. అమెరికాలో సూపర్ కలెక్షన్!
on Nov 12, 2022

సమంత టైటిల్ రోల్ పోషించిన 'యశోద' సినిమాకు అన్ని వైపుల నుంచీ పాజిటివ్ టాక్ వచ్చింది. నవంబర్ 11న విడుదలైన 'యశోద' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ. 3 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. సరొగేట్ మదర్‌గా సమంత ప్రదర్శించిన అభినయం, ఆమె చేసిన ఫైట్లు.. మాస్, క్లాస్ ఆడియెన్స్ ఇద్దరినీ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో సమంత సినిమాకు ప్రేక్షకులు రూ. 1.4 కోట్ల గ్రాస్‌ను అందజేశారు. హౌస్‌ఫుల్ బోర్డులు పడిన థియేటర్లు ఎక్కువగానే కనిపించాయి. వాటిలో సెకండ్ షోలు ఉండటం విశేషం. ఫస్ట్ డే వచ్చిన రెస్పాన్స్ చూసి మల్టీప్లెక్సులు రెండో రోజు షోలను పెంచాయి.
తమిళనాట 'యశోద' తమిళ వెర్షన్‌ను ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి. మౌత్ టాక్ బాగుండటంతో అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి 2 లక్షల డాలర్లను వసూలు చేసింది 'యశోద'. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాకు ఇలాంటి కలెక్షన్లు రాలేదని అక్కడి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సమంత క్రేజ్‌కు ఇది నిదర్శనం.
తమిళులైన హరి శంకర్, హరీశ్ నారాయణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన 'యశోద' మూవీలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, శత్రు, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు చేశారు. మణిశర్మ మ్యూజిక్, ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్, అశోక్ కుమార్ ఆర్ట్ వర్క్, పులగం చిన్నారాయణ, చల్లా భాగ్యలక్ష్మి సంభాషణలు సినిమా విజయంలో తమ వంతు పాత్ర పోషించాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



