'హిట్-2' టీజర్.. అడివి శేష్ మరో హిట్ కొట్టేలా ఉన్నాడు!
on Nov 3, 2022

అడివి శేష్ ప్రధాన పాత్రలో శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'హిట్-2'(హిట్: ది సెకండ్ కేస్). 2020 లో విడుదలై విజయం సాధించిన 'హిట్: ది ఫస్ట్ కేస్'కి సీక్వెల్ గా వస్తోంది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న 'హిట్-2' మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.
నిమిషన్నర నిడివి గల 'హిట్-2' టీజర్ ఆకట్టుకుంటోంది. కృష్ణ దేవ్ అలియాస్ కేడీ అనే నోటిదూల ఉన్న పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ కనిపిస్తున్నాడు. "ఈ సిటీలో పెద్ద క్రైమ్స్ ఏం జరుగుతాయిలే" అంటూ రావు రమేష్, అడివి శేష్ మధ్య వచ్చే సంభాషణ నవ్విస్తోంది. మొదటి 40 సెకన్లు కామెడీ, రొమాన్స్ తో సరదాగా సాగిన టీజర్.. ఆ తర్వాత ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. ఒకమ్మాయి శరీర భాగాలను వేరు చేసి, ఎవరో హత్య చేస్తారు. ఆ కేసుని చేధించడమే 'హిట్-2' కథ అన్నట్టుగా టీజర్ ని ఆసక్తికరంగా మలిచారు. టీజర్ ని బట్టి చూస్తే ఇటీవల 'మేజర్'తో ఆకట్టుకున్న అడివి శేష్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు.
నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాన్ స్టీవర్ట్ ఏడురి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



