త్రివిక్రమ్ అ..ఆ కోసం ఏం చేశాడో చూశారా..!
on Jun 1, 2016
.jpg)
మాటల మాంత్రికుడు అన్న పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్, తన సినిమా ప్రమోషన్స్ కూడా చాలా తెలివిగా ప్లాన్ చేస్తారు. మరికొద్ది గంటల్లో ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన అ..ఆ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఎక్కడా ప్రమోషన్ల జోరు లేదు. ఏదో హీరో హీరోయిన్లు ఒకటో రెండో ఛానల్స్ లో కనిపిస్తున్నారు తప్ప, మూవీ యూనిట్ హడావిడి మాత్రం ఎక్కడా లేదు. దీనికి కారణం త్రివిక్రమేనట. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం భీభత్సమైన ప్రమోషన్లు చేసి లోపల విషయం లేకపోవడంతో ఎలా చతికిలపడ్డాయో చూశాం.
దాంతో ప్రేక్షకులు సినిమా చూసి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ప్రమోషన్లు ముమ్మరం చేయాలని, అప్పటి వరకూ సినిమాపై అంచనాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని త్రివిక్రమ్ అనుకున్నాడట. అందుకే ప్రమోషన్లలో కూడా హీరో హీరోయిన్లు మంచి సినిమా అంటూ చెబుతున్నారు తప్ప, మా సినిమా కేక, కళాఖండం అని కోతలు కోయట్లేదు. సినిమాను మరీ హైట్స్ కు తీసుకెళ్లిపోకుండా ట్రైలర్ ను కూడా చాలా సింపుల్ గానే కట్ చేశాడు మాంత్రికుడు. సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత, ప్రమోషన్ల కోసం తాను డిజైన్ చేయించిన డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ను ఎయిర్ చేయబోతున్నాడట. సినిమాకు ముందు తను మాట్లాడటం కంటే, సినిమా మాట్లాడిన తర్వాతే తాను మాట్లాడితే బాగుంటుందని ఫిక్సయ్యాడట. మరి ప్రేక్షకులు త్రివిక్రమ్ సినిమాను ఎలా స్వీకరిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



