'కాంతార' కలెక్షన్స్.. కర్ణాటక కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ!
on Oct 17, 2022

భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. కన్నడ సినిమా 'కాంతార'కు కర్ణాటకలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ రావడం ఆసక్తికరంగా మారింది.
కర్ణాటకలో సెప్టెంబర్ 30న విడుదలైన 'కాంతార' మొదటి రోజు రూ.2.5 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మౌత్ టాక్ తో సంచలన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక తెలుగులో అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ.4 కోట్లకు పైగా గ్రాస్, రెండో రోజు రూ.5 కోట్లకు పైగా గ్రాస్ తో కన్నడను మించిన ఓపెనింగ్స్ తో సత్తా చాటింది.
తెలుగులో 'కాంతార' బిజినెస్ వాల్యూ రూ.2 కోట్లని అంచనా. అయితే ఈ చిత్రం మొదటి రోజే రూ.2.1 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక రెండో రోజు రూ.2.80 కోట్ల షేర్ తో మరింత జోరు చూపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు రోజుల్లోనే 4.90 షేర్(9.85 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన 'కాంతార' చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రిషబ్ తో పాటు సప్తమి, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించారు. తెలుగులో 'కాంతార'ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



