బిగ్ ట్విస్ట్.. ఆరేళ్ళ క్రితమే పెళ్లి చేసుకున్న నయన్-విఘ్నేష్!
on Oct 17, 2022

కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వివాదానికి తెరదీసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగు నెలలకే తల్లిదండ్రులైనట్టు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. సరోగసీ చట్టాన్ని అతిక్రమించి వీరు పిల్లలకు జన్మనిచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విచారణ జరపటానికి తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. ఈ విచారణలో భాగంగా ఒక బిగ్ ట్విస్ట్ వెలుగు చూసినట్టు తెలుస్తోంది.
తాము ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని నయనతార, విఘ్నేష్ జంట కమిటీకి సర్టిఫికేట్ ని చూపించారట. అదే విధంగా తాము గత డిసెంబర్ లో సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్నామని, చట్ట ప్రకారమే సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు అయ్యామని తెలుపుతూ అన్ని ఆధారాలను చూపించారట. సరోగసి చట్టం ప్రకారం పెళ్లైన జంట ఐదు సంవత్సరాలు దాటిన తర్వాతే సరోగసీ విధానాన్ని ఆశ్రయించాలి. ఆ పరంగా చూస్తే నయన్-విఘ్నేష్ జంట చట్టాన్ని ఉల్లంఘించలేదు. మరి ఇప్పటికైనా ఈ సరోగసీ వివాదం నుంచి ఈ సెలబ్రిటీ కపుల్ బయట పడతారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



