'దసరా'లో కీర్తి సురేష్.. ఊర మాస్!
on Oct 17, 2022

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ 'దసరా'. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని ఫస్ట్ లుక్, గ్లింప్స్, 'ధూమ్ ధామ్ దోస్తాన్' సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.
నేడు(అక్టోబర్ 17) కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా 'దసరా' నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. పెళ్లి బరాత్ లో పెళ్లి కూతురు దుస్తులలో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న కీర్తి లుక్ ఆకట్టుకుంటోంది. తెలంగాణకు చెందిన పక్కా పల్లెటూరి అమ్మాయిలా కీర్తి కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమె వెన్నెల అనే పాత్ర పోషిస్తున్నట్టుగా పోస్టర్ లో పేర్కొన్నారు. గతంలో నాని, కీర్తి కాంబినేషన్ లో వచ్చిన 'నేను లోకల్'(2017) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ జోడి మరోసారి హిట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
.webp)
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా సత్యన్ సూర్యన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 2023 మార్చి 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



