దర్శకేంద్రుని మాజీ కోడలు మళ్లీ పెళ్లాడింది!
on Jan 5, 2021

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాజీ కోడలు, ప్రకాశ్ కోవెలమూడి మాజీ భార్య కణికా ధిల్లాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కణిక సినీ రచయిత్రి అనే విషయం తెలిసిందే. ప్రకాశ్ డైరెక్ట్ చేసిన సినిమాలకు ఆమె స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. ప్రేమలో పడిన వారిద్దరూ 2014లో దంపతులయ్యారు. అయితే వారి వైవాహిక బంధం మూడేళ్లే కొనసాగింది. 2017లో ఆ ఇద్దరూ చట్టప్రకారం విడిపోయారు.
ఆ తర్వాత ముంబైకే చెందిన మరో బాలీవుడ్ రైటర్ హిమాన్షు శర్మతో ప్రేమలో పడ్డారు కణిక. సోమవారం వారు వివాహం చేసుకున్నారు. కొన్ని వారాల క్రితం వారి ఎంగేజ్‌మెంట్ జరిగింది. నిరాడంబరంగా జరిగిన తమ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని పిక్చర్స్‌ను కణిక తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. వాటికి “Here is to #2021 #newbeginnings #himanshusharma. (sic)” అనే క్యాప్షన్ జోడించారు.
.jpg)
ఆ పిక్చర్స్‌లో మజెంటా కలర్ డ్రస్‌లో కణిక గార్జియస్‌గా కనిపిస్తున్నారు. హిమాన్షు తెల్లటి కుర్తా, పైజమా ధరించి, మస్టర్డ్ కలర్ నెహ్రూ జాకెట్ ధరించారు. 2019లో ఆ ఇద్దరూ డేటింగ్ చేస్తూ వస్తున్నారు. 2020 జూన్‌లో తమ అనుబంధాన్ని బహిర్గతం చేశారు.
.jpg)
హిమాన్షు 'రాన్‌ఝానా', 'తను వెడ్స్ మను', 'జీరో' చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ కలయికలో వస్తోన్న 'అత్రంగి రే'కు రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రకాశ్ కోవెలమూడి డైరెక్ట్ చేసిన 'సైజ్ జీరో', 'జడ్జ్‌మెంటల్ హై క్యా' సినిమాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసిన కణిక, బాలీవుడ్‌లో రా.వన్, మన్‌మర్జియాన్, కేదార్‌నాథ్, గిల్టీ చిత్రాలకు రైటర్‌గా పనిచేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



