యష్‌తో పూరి మాఫియా డ్రామా?
on Jan 5, 2021

దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం ఈ స్టార్ కెప్టెన్.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే పునః ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. ఫైటర్ తరువాత కూడా పూరి మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో కేజీఎఫ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించే అవకాశముందంటున్నారు. అంతేకాదు.. మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. అన్నీ కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కే అవకాశముందంటున్నారు. త్వరలోనే పూరి, యష్ కాంబినేషన్ మూవీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. కన్నడలో పూరి ఇప్పటికే యువరాజా (తమ్ముడుకి రీమేక్), అప్పు (ఇడియట్ కి మాతృక) వంటి సినిమాలు రూపొందించి.. అక్కడ కూడా తనదైన ముద్రవేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



