ఓటీటీలో నాగ్ వైల్డ్ డాగ్?
on Jan 5, 2021

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్. ఇందులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీసర్ గా నాగ్ దర్శనమివ్వనున్నారు. ఊపిరి, మహర్షి చిత్రాల రచయిత అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మాజీ మిస్ ఆసియా పసిఫిక్ దియా మీర్జా.. నాగ్ కి జోడీగా నటించింది. రేయ్ ఫేమ్ సయామీ ఖేర్ ప్రధాన పాత్రలో దర్శనమివ్వనుండగా.. అతుల్ కులకర్ణి, అలీ రెజా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు.
ఇదిలా ఉంటే.. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికలో స్ట్రీమ్ కానుందని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న నెట్ ఫ్లిక్స్ లో వైల్డ్ డాగ్ స్ట్రీమ్ కాబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



