'118' దర్శకుడితో మరోసారి కళ్యాణ్ రామ్?
on Jan 5, 2021

కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో చివరి హిట్.. '118'. ప్రముఖ ఛాయాగ్రహకుడు కె.వి. గుహన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకున్నప్పటికీ ఫైనల్ గా విజయవంతమైన చిత్రాల్లో చేరిపోయింది. అలాంటి సక్సెస్ ఫుల్ వెంచర్ తరువాత కళ్యాణ్ రామ్, కె.వి. గుహన్ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతోందని సమాచారం. అయితే ఈ సారి స్ట్రయిట్ సబ్జెక్ట్ తో కాకుండా ఓ రీమేక్ ప్రాజెక్ట్ తో ఈ కాంబో పలకరించనుందని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. 2020 జనవరిలో విడుదలైన మలయాళ చిత్రం 'అంజామ్ పాతిరా' (ఐదో అర్థరాత్రి అని అర్థం) ఆధారంగా కళ్యాణ్ రామ్ హీరోగా గుహన్ ఓ సినిమా ప్లాన్ చేశాడని.. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ చిత్రంలో కుంచకో బోబన్ ('నువ్వేకావాలి' మాతృక 'నిరమ్' లో కథానాయకుడు) పోషించిన పాత్రని తెలుగులో కళ్యాణ్ రామ్ ధరిస్తాడని వినికిడి. త్వరలోనే కళ్యాణ్ రామ్, గుహన్ సెకండ్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
మరి.. '118' తరహాలోనే థ్రిల్లర్ మూవీతోనే రాబోతున్న ఈ డ్యూయో.. మరో హిట్ ని తమ ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



