జాన్వీ కొన్న ట్రిప్లెక్స్ విలువ ఎంతో తెలిస్తే.. కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
on Jan 5, 2021

దివంగత శ్రీదేవి కుమార్తె 23 ఏళ్ల జాన్వీ కపూర్ ముంబైలోని పాష్ ఏరియా జుహులో ఓ ట్రిప్లెక్స్ హౌస్‌ను కొనుగోలు చేసింది. దీని విలువ అక్షరాలా రూ. 39 కోట్లు! బాలీవుడ్ సెలబ్రిటీలలో పాపులర్ అయిన జె.వి.పి.డి. స్కీమ్ కింద నిర్మించిన బిల్డింగ్‌లో 14, 15, 16 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్ విస్తరించి ఉంది.
ఈ అపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్ కోసమే జాన్వీ రూ. 78 లక్షలు చెల్లించింది. డిసెంబర్ 7న డీల్ కుదరగా, డిసెంబర్ 10న ఆమె రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించింది. ఈ మూడు అపార్ట్‌మెంట్స్‌తో పాటు జాన్వీకి ఆ బిల్డింగ్‌లో 6 కార్లు పెట్టుకొనే వీలుగా కార్ పార్కింగ్‌ను అలాట్ చేశారు. డాక్యుమెంట్స్ ప్రకారం ఆమె కొనుగోలు చేసిన ఫ్లాట్ తాలూకు కార్పెట్ ఏరియా 3,456 చదరపు అడుగులు. పలువురు సెలబ్రిటీలు ఆ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు.
ప్రస్తుతం జాన్వీ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి గోవాలో హాలిడేస్ గడుపుతోంది. ఇటీవల ఆ ఇద్దరూ ఓ రెస్టారెంట్‌లో భోజనం చేయడానికి వెళ్లగా ఫ్యాన్స్ కంటికి కనిపించారు. ఆ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. త్వరలో ఆ ఇద్దరూ 'దోస్తానా 2' మూవీలో కలిసి కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



