ట్రిపుల్ రోల్ లో కళ్యాణ్ రామ్.. వెరైటీ టైటిల్!
on Oct 12, 2022

ఈ ఏడాది 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ అందుకొని జోరు మీదున్న నందమూరి కళ్యాణ్ రామ్ మరో చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రానికి ఓ విభిన్న టైటిల్ ని కూడా ఖరారు చేశారని సమాచారం.
'హరే రామ్', 'బింబిసార' వంటి చిత్రాలలో ద్విపాత్రాభినయం పోషించి అలరించిన కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హీరోగా కళ్యాణ్ రామ్ కి 19వది. ఇందులో మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఆ మూడు పాత్రలు వేటికవే భిన్నంగా పవర్ ఫుల్ గా ఉంటాయట. అంతేకాదు ఈ చిత్రానికి 'ఎమిగోస్' అనే విభిన్న టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు టాక్.
ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల గోవాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనితో పాటు 'డెవిల్' అనే ఓ పీరియాడిక్ ఫిల్మ్ కూడా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



