తగ్గేదేలే.. 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్న బన్నీ!
on Oct 13, 2022

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ 'పుష్పకి ముందు పుష్పకి తర్వాత' అన్నట్టుగా ఉంది. అంతకముందు సౌత్ కే పరిమితమైన ఆయన క్రేజ్ 'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ గా విస్తరించింది. కొంతకాలంగా ఎక్కడ చూసినా 'తగ్గేదేలే' అంటూ బన్నీ మేనియానే కనిపిస్తోంది. ఇక తాజాగా ఆయన 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందుకొని సత్తా చాటాడు.
2022 కి గాను ఎంటర్టైన్మెంట్ విభాగంలో బన్నీ 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్నాడు. బుధవారం సాయంత్రం జరిగిన వేడుకలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నాడు. సౌత్ నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి నటుడు బన్నీనే కావడం విశేషం. ఈ అవార్డుని కోవిడ్ వారియర్స్ కి అంకితం ఇస్తున్నట్టుగా బన్నీ ప్రకటించాడు.
బన్నీ ప్రస్తుతం 'పుష్ప-2' చిత్రం చేస్తున్నాడు. 'పుష్ప-1'తోనే ఇంతటి సంచలనం సృష్టించిన బన్నీ.. 'పుష్ప-2'తో ఇంకెంతటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



