దెయ్యంగా మారిన కాజల్!
on Oct 31, 2022

కాజల్ అగర్వాల్ నటిస్తోన్న లేటెస్ట్ తమిళ్ ఫిల్మ్ 'ఘోస్టీ'. హారర్ కామెడీగా రూపొందుతోన్న ఈ మూవీని కల్యాణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అక్టోబర్ 31న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రకారం కాజల్ రెండు పాత్రల్లో కనిపించనున్నది. ఒకటి.. పోలీస్ ఇన్‌స్పెక్టర్ క్యారెక్టర్ కాగా, ఇంకొకటి.. సినీ హీరోయిన్ క్యారెక్టర్. ఇదివరకు ఈ సినిమా నేరుగా ఓటీటీలో రానున్నట్లు ప్రచారం జరిగింది. టీజర్‌తో ఆ ప్రచారానికి చెక్ పెట్టిన మేకర్స్.. 'ఘోస్టీ' థియేటర్లలో రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు.
కాజల్ ఇటీవలే కమల్ హాసన్ మూవీ 'ఇండియన్ 2' (భారతీయుడు 2) షూటింగ్‌ను మొదలుపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆమె ఒక బాబుని ప్రసవించింది. అతనికి నీల్ అనే పేరు పెట్టారు కాజల్, గౌతం దంపతులు.
సోమవారం తన ఇన్‌స్టాగ్రాం స్టోరీస్ ద్వారా 'ఘోస్టీ' టీజర్‌ను షేర్ చేసిన కాజల్, "Here we go. A full on entertainment mode teaser of #Ghosty starring #YogiBabu and me! Perfect for Haloween, isn't it?! :) From the director of Gulebaghavali and Jackpot #Kalyaan! (sic)." అని రాసుకొచ్చింది.
టీజర్‌లో చూపించిన దాని ప్రకారం హీరోయిన్ చనిపోయి దెయ్యంగా మారి, ఇన్‌స్పెక్టర్ క్యారెక్టర్‌ను సతాయిస్తుందని తెలుస్తోంది. ఒక్క యోగిబాబు మాత్రమే ఆ ఆత్మను చూడగలుగుతాడని కూడా అర్థమవుతోంది.
'ఘోస్టీ' మూవీలో కాజల్ అగర్వాల్, యోగిబాబు, కె.ఎస్. రవికుమార్, ఊర్వశి, రాధిక, రెడిన్ కింగ్‌స్లే, ఆడుకాలం నరైన్ కీలక పాత్రధారులు, సాం సీఎస్ మ్యూజిక్ అందిస్తుండగా, జాకబ్ రత్నరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



