'హిట్-2' టీజర్ వచ్చేస్తోంది.. విశ్వక్ సేన్ ఎంట్రీ ఉంటుందా?
on Oct 31, 2022

అడివి శేష్ ప్రధాన పాత్రలో శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హిట్-2'(హిట్: ది సెకండ్ కేస్). 2020 లో విడుదలై విజయం సాధించిన 'హిట్: ది ఫస్ట్ కేస్'కి సీక్వెల్ గా వస్తోంది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న 'హిట్-2' నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.
'హిట్'కి సీక్వెల్ కావడంతో పాటు 'మేజర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అడివి శేష్ నటిస్తున్న సినిమా కావడంతో 'హిట్-2'పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు టీజర్ కి ముహూర్తం ఖరారైంది. ఈ చిత్ర టీజర్ ను నవంబర్ 3న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
'హిట్-2' టీజర్ డేట్ ని రివీల్ చేస్తూ 'ది వరల్డ్ ఆఫ్ హిట్' పేరుతో ఒక వీడియోని విడుదల చేశారు. అందులో హిట్ ప్రపంచం గురించి చెబుతూ దర్శకుడు శైలేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'హిట్-2'లో కృష్ణ దేవ్ అనే పాత్రలో అడివి శేష్ చేసినంత మాత్రాన, 'హిట్-1'లో విశ్వక్ సేన్ పోషించిన విక్రమ్ పాత్ర ముగిసినట్టు కాదని, ఈ సిరీస్ నుంచి వచ్చే ఇతర భాగాల్లోనూ ఆ పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



