ఆ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఆగిపోయాయా?.. అసలు నిజమిదే!
on Oct 31, 2022

'ఎన్టీఆర్ 30', 'ssmb 28' సినిమాలు ఆగిపోయాయని ఈ ఉదయం నుంచి న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ సినిమాలు ఆగిపోలేదని ఇరు మూవీ టీమ్ లు క్లారిటీ ఇచ్చాయి. 'ఎన్టీఆర్ 30' త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ కాబోతుండగా, 'ssmb 28' రెండో షెడ్యూల్ కి సిద్ధమవుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న 'ఎన్టీఆర్ 30'(వర్కింగ్ టైటిల్) పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని, త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తో కలిసి కొరటాల శివ ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంతో పూర్తి చేస్తున్నారని సమాచారం. నవంబర్ రెండో వారంలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం కానుందని, రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలయ్యే అవకాశముందని అంటున్నారు.

'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న చిత్రం 'ssmb 28'(వర్కింగ్ టైటిల్). ఈ మూవీ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అందులో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. అయితే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని, త్రివిక్రమ్ తీరు పట్ల మహేష్ అసంతృప్తిగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ వార్తల్లో నిజంలేదని తేలిపోయింది. 'ssmb 28' రెండో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభమవుతుందని తాజాగా నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికర అప్డేట్స్ రాబోతున్నట్టు చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



