వరుస నెలల్లో కాజల్ సందడి!
on Feb 6, 2022

ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూ.. త్వరలో పండంటి బిడ్డకు అమ్మ కాబోతోంది కాజల్ అగర్వాల్. మరోవైపు ఇప్పటికే ఆమె పూర్తిచేసిన రెండు చిత్రాలు వరుస నెలల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, అదితి రావ్ హైదరీతో కలిసి కాజల్ నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా `హే సినామిక`. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మార్చి 3న విడుదల కాబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ప్రధానంగా తమిళ చిత్రమైన `హే సినామిక` తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. అలాగే `ఖైదీ నంబర్ 150` వంటి సంచలన విజయం తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి కాజల్ నటించిన `ఆచార్య` చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 29న థియేటర్స్ లో సందడి చేయనుంది. విజనరీ డైరక్టర్ కొరటాల శివ ఈ సోషల్ డ్రామాని తెరకెక్కించారు. మరి.. వరుస నెలల్లో రాబోతున్న ఈ సినిమాలతో కాజల్ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
కాగా, మరోవైపు కాజల్ నటించిన తమిళ చిత్రాలు `ఘోస్టీ`, `కరుంగాపియమ్`తో పాటు హిందీ సినిమా `ఉమ` చిత్రీకరణ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



