రజనీ ' కబాలీ ' రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది..!
on May 12, 2016

రజనీ కబాలీకి డేట్ ఖరారైంది. చాలా కాలంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కబాలీ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. జూలై 1న సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకుంది కబాలీ మూవీ టీం. గత కొంత కాలంగా కబాలీ విడుదల గురించి రకరకాల వార్తలు వినబడుతూ వచ్చాయి. తెలుగులో అయితే, డిస్ట్రిబ్యూటర్ల గొడవ కారణంగా ఏకంగా రిలీజ్ చేయడమే కష్టమని సినీపండితులు తేల్చేశారు. అలాంటిది ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, రజినీ అభిమానులకు శుభవార్త అని చెప్పాలి. నిజానికి సినిమాను జూన్ లో విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల జూలై 1 కు మార్చేశారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తోంది కబాలీ టీం. ఇప్పటికే టీజర్ బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని జరుపుకుంటున్న కబాలీలో రజనీ భాషా సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం కూడా నడుస్తోంది. ఏది నిజమో, విడుదలైతే గానీ తెలీదు మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



