ఈ వారం డబ్బింగ్ సినిమాలే..!
on May 13, 2016
వస్తే ఒకేసారి రిలీజ్ లతో విరుచుకుపడిపోయే తెలుగు సినిమాలు, ఈ వారం మాత్రం సైలెంట్ అయిపోయాయి. మే 13 న బాక్సాఫీస్ దగ్గర పోటీపడటానికి ఒక తెలుగు సినిమా కూడా లేకపోవడం విచిత్రం. సూర్య 24, సాయి ధరమ్ సుప్రీం, అల్లు అర్జున్ సరైనోడు సినిమాలతోనే ఆడియన్స్ కూడా అడ్జెస్ట్ అయిపోవాల్సిన పరిస్థితి. ఈ వారం సరైన రిలీజ్ లు లేకపోవడంతో, బాక్సాఫీస్ మరో వన్ వీక్ పాటు ఆ మూడు సినిమాలకు కాసులు కురిపించబోతోంది. ఇక రిలీజ్ లు చూస్తే, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా చేసిన పిచ్చైకారన్ ను తెలుగులో బిచ్చగాడుగా తీసుకొస్తున్నారు. తమిళంలో యావరేజ్ గా నడిచిందీ సినిమా. ఇక మరో సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్, తెలుగమ్మాయి శ్రీదివ్య లీడ్ పెయిర్ గా నటించిన పెన్సిల్ కూడా ఈ రోజే తెలుగులో రిలీజవుతోంది. తర్వాతి వారం బ్రహ్మోత్సవం తెలుగు తెరపైకి రాబోతోంది. అప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులకు పాత రిలీజ్ లే టైం పాస్.