హీరో నాని ' జెంటిల్ మన్ ' టీజర్ రివ్యూ..!
on May 12, 2016
.jpg)
అష్టా చెమ్మా లాంటి హిట్ సినిమా తర్వాత నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ కలిసి చేస్తున్న సినిమా జెంటిల్ మన్. సరికొత్త థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిందని మూవీ యూనిట్ చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరింటికి ఈ సినిమా టీజర్ ను నాని తన ట్విట్టర్లో రిలీజ్ చేశాడు. కనిపించేంత మంచివాడు కాదు అంటూ ట్వీట్ చేసిన నాని, టీజర్ లింక్ ను షేర్ చేశాడు. సినిమాలో నాని విలనా లేక హీరోనా అన్న సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు. సురభి నివేదా థామస్ ల డైలాగ్స్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. చూడబోతే ఈ సినిమాలో నాని ఫైటింగ్స్ కూడా కాస్త ఎక్కువగానే చేసినట్టు కనిపిస్తోంది. టీజర్ మధ్యలో సురభి, నానికి ఐలవ్యూ చెప్పిన తర్వాత ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. కనిపించేంత మంచివాడు మాత్రం కాదు అన్న డైలాగ్ తర్వాత నానిలోని మరోకోణం ఆవిష్కరించాడు దర్శకుడు. నిన్ను అంత ఈజీగా చావనిస్తానా అంటూ నాని డైలాగ్, యాక్సిడెంట్ నుంచి హీరోయిన్ తప్పించుకోవడం లాంటి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చివరిగా హీరోనా, విలనా అని క్వశ్చన్ వేసి టీజర్ ను ముగించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లలాగే, టీజర్ కూడా చాలా ఆసక్తిని కలిగిస్తోంది. మరి నాని హీరోనా విలనా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



