ఎన్టీఆర్‌ని రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు
on Sep 21, 2016

నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాడు ఎన్టీఆర్. ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ ఎదుర్కొంటున్న సిట్యువేషన్ ఇది. వరుసగా మూడు హిట్లొచ్చాయి. జనతా అయితే ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈ విజయాల్ని కాపాడుకోవాలన్న కృత నిశ్చయంతో ఎన్నాడు జూనియర్. అందుకే మరింత జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలనుకొంటున్నాడు. ఎన్టీఆర్ పిలిస్తే.. అగ్ర దర్శకులు సైతం సై అంటూ రంగంలోకి దిగిపోతారు. కానీ ఎన్టీఆర్ ఎక్కడా తొందర పడడం లేదు. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, లింగు స్వామి ఇలా... ఎన్టీఆర్ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. వాళ్లంతా ఎన్టీఆర్‌ని రౌండప్ చేసి, కన్‌ఫ్యూజ్‌లో పడేశారు.
జనతా తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయంలో ఎన్టీఆర్ ఓ క్లారిటీకి రాలేకపోతున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్, ఫక్తు యాక్షన్ డ్రామా, రొమాంటిక్ లవ్ స్టోరీ... ఇలా ఎన్టీఆర్ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఎలాంటి సినిమా చేస్తే మరింత పెద్ద విజయం వస్తుందో అనే లెక్కల్లో ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే... వక్కంతం వంశీ ఎన్టీఆర్ దర్శకుల జాబితాలోంచి డ్రాప్ అయిపోయి మరో గూటికి చేరాడు. పూరి జగన్నాథ్ కూడా డౌటే అన్నది చాలామంది అభిప్రాయం. ఇజం సినిమా సరిగా రాలేదని ఎన్టీఆర్‌కి హింట్ అందిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాలు ఆల్రెడీ పూరి కెరీర్‌ని డామేజ్ చేసి పాడేశాయి. ఇజం కూడా తుస్సుమంటే... ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడం కష్టమే. ఇజం రిపోర్ట్ చూసి అప్పుడు పూరి సంగతి ఆలోచిద్దాం అని డిసైడ్ అయ్యాడని.. అందుకే అప్పటి వరకూ మౌనంగా ఉండాలని భావిస్తున్నాడని టాక్. దానికి తోడు పూరి ఇప్పటి వరకూ ఎన్టీఆర్‌కి పూర్తి స్థాయి కథే చెప్పలేదట. ఇజం కాస్త అటూ ఇటూ అయితే... పూరి కచ్చితంగా లింగుస్వామితోనే జట్టు కడతాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ పద్ధతి చూస్తుంటే మరీ అతి జాగ్రత్తకు పోతున్నాడేమో అని కూడా అనిపిస్తోంది. స్పీడులో ఉన్నప్పుడే చక చక సినిమాలు చేసుకోవాలి. కథలు సిద్దం చేసుకొని ఒక దాని తరవాత మరోటి పట్టాలెక్కించాలి. ఈ విషయంలో ఎన్టీఆర్‌తో పోలిస్తే మిగిలిన హీరోలే నయం అనిపిస్తోంది. ఎవ్వరూ ఒక్క నెల కూడా ఖాళీ గా ఉండడం లేదు. సీనియర్లు సైతం సినిమా తరవాత సినిమా అంటూ వేగంగా దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. సింహాద్రి తరవాత దూకుడు నిర్ణయాల వల్ల ఎన్టీఆర్ కెరీర్ తిరోగమన దిశలో వెళ్లింది. మళ్లీ ఆ తప్పు చేయకూడదనే ఎన్టీఆర్ మరీ ఇంత జాగ్రత్త పడిపోతున్నాడేమో మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



