పాక్ ప్రధానిపై సల్మాన్ ఫాదర్ సెటైర్స్..
on Sep 21, 2016

యూరీలో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది జవాన్ల ప్రాణాలు బలిగొనడంతో భారతీయులు పాక్ అంటే రగిలిపోతున్నారు. పాక్‌ను దెబ్బకు దెబ్బ తీయాలంటూ ఊగిపోతున్నారు..ఈ మేరకు సోషల్ మీడియాలో కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలా డిమాండ్ చేస్తున్న వారిలో సామాన్యుల నుంచి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ తండ్రి, రచయిత సలీంఖాన్ ట్విట్టర్ వేదికగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై సెటైర్లు వేశారు. నవాజ్ మాటలను పాకిస్థానీలు ఎవరూ వినరని ఒకప్పుడు తానే చెప్పుకొన్నారు. సైన్యం, పార్లమెంట్, ప్రజలు..ఎవరూ వినరు. కనీసం ఆయన కుటుంబీకులైనా వింటారో లేదో. అలాంటిది ఇప్పుడాయన భారత్ గురించి ప్రపంచమంతా తిరిగి చెబితే వింటారా..? ఆయన పేరును "నవాజ్ షరీఫ్" అని కాదు "బేనవాజ్ శరీర్" అని మార్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



