'గని' విడుదల వాయిదా.. నానికి కలిసొచ్చింది!
on Dec 10, 2021

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'గని'. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న వరుణ్.. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'గని'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 24 న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు సినిమాని డిసెంబర్ 24 న విడుదల చేయడం లేదంటూ తాజాగా మేకర్స్ ప్రకటించారు.
Also Read: వరంగల్ లో 'శ్యామ్ సింగరాయ్' రాయల్ ఈవెంట్!
టాలీవుడ్ లో వరుస సినిమాల సందడి మొదలైంది. డిసెంబర్ 17 న 'పుష్ప', డిసెంబర్ 24 న 'శ్యామ్ సింగరాయ్', డిసెంబర్ 31 న '1945' విడుదల కానున్నాయి. డిసెంబర్ 24 న 'గని' కూడా విడుదల కావాల్సి ఉంది. సెకండ్ లాక్ డౌన్ తర్వాత 'అఖండ' ప్రభంజనంతో ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో జోష్ వచ్చింది. ఈ క్రమంలో వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ.. మహమ్మారి దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలో.. సినిమాలను పోటాపోటీగా విడుదల చేసి ఒకరి బిజినెస్ ని మరొకరు దెబ్బకొట్టడం సరి కాదన్న ఉద్దేశంతో గని విడుదలని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాని థియేటర్స్ లోనే విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.
Also Read: 'తెలుగు వన్' సినిమా.. ఏపీలో పెను సంచలనం అవుతుంది!

Also Read: సూపర్ స్టార్ కి గూస్ బంప్స్ తెప్పించిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్!
'గని' వాయిదా పడటం నానికి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. గత రెండు చిత్రాలు వి, టక్ జగదీష్ లను ఓటీటీలో విడుదల చేసి నిరాశపరిచిన నాని.. 'శ్యామ్ సింగరాయ్'తో థియేటర్స్ లో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఇప్పుడు గని కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో క్రిస్మస్ కి సోలోగా అలరించడానికి నానిని ఛాన్స్ దొరికింది.
Also Read: 'లక్ష్య' మూవీ రివ్యూ
'గని' మార్చిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనవరిలో 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధే శ్యామ్', 'బంగార్రాజు' వంటి సినిమాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో 'ఆచార్య', 'ఖిలాడీ'తో పాటు వరుణ్ నటించిన మరో మూవీ 'ఎఫ్3' విడుదల కానున్నాయి. మార్చి 25 న 'రామారావు ఆన్ డ్యూటీ' ఉన్నా మొదటి మూడు వారలు పెద్ద సినిమాలు లేవు కాబట్టి గని మార్చిలో విడుదలయ్యే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



