ఎన్టీఆర్ షర్ట్ విప్పితే బొమ్మ బ్లాక్ బస్టరే..!
on Jul 25, 2025

గత పదేళ్లుగా అపజయమెరుగని హీరోగా దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ షర్ట్ లేకుండా స్క్రీన్ పై కనిపిస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ కూడా పడిపోయింది. మొదటిసారి 'టెంపర్'లో షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు ఎన్టీఆర్. టెంపర్ సూపర్ హిట్ కావడమే కాకుండా, ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 'అరవింద సమేత'లో ఇంట్రో ఫైట్ లో షర్ట్ లెస్ గా కనిపించాడు. ఆ ఫైట్ సీక్వెన్స్ లో కత్తికున్న రత్నాన్ని ప్యాంట్ కి పూసే షాట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. 'అరవింద సమేత' మూవీ ఆ టైంకి ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే 'ఆర్ఆర్ఆర్' ఇంట్రడక్షన్ సీన్ లో కూడా షర్ట్ లేకుండా కనిపించాడు ఎన్టీఆర్. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచనాలు సృష్టించిందో తెలిసిందే. ఎన్టీఆర్ షర్ట్ లెస్ గా కనిపించిన 'టెంపర్', 'అరవింద సమేత', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు మూడూ కూడా ఒకదానిని మించిన ఒకటి విజయం సాధించాయి. ఇప్పుడు 'వార్-2' వంతు వచ్చింది.
'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా 'వార్-2' ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ ట్రైలర్ కట్ ఉంది. ముఖ్యంగా ఒక షాట్ లో ఎన్టీఆర్ షర్ట్ లేకుండా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'అరవింద సమేత'ను గుర్తుచేసేలా ఆ షాట్ ఉంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ షర్ట్ లెస్ సీన్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి.. 'టెంపర్', 'అరవింద సమేత', 'ఆర్ఆర్ఆర్'లను మించిన విజయం 'వార్-2' సాధిస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



