War 2: టీజర్ అలా.. ట్రైలర్ ఇలా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి..?
on Jul 25, 2025

'వార్-2' మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా 'వార్'కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే నెలలో విడుదలైన టీజర్ ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోని మరింత పవర్ ఫుల్ గా చూడాలనుకున్నారు. అందుకే ట్రైలర్ కోసం వారు ఎంతగానో ఎదురుచూశారు. (War 2 Trailer)
'వార్-2' ట్రైలర్ తాజాగా విడుదలైంది. రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ కట్ అదిరిపోయింది. "నేను ప్రమాణం చేస్తున్నాను. నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, నా కుటుంబాన్ని.. అన్నింటినీ వదిలేసి ఒక నీడలా మారిపోతాను" అంటూ హృతిక్ రోషన్ పాత్రను పరిచయం చేశారు. "నేను మాట ఇస్తున్నాను. ఎవరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను." అంటూ ఎన్టీఆర్ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. హృతిక్, ఎన్టీఆర్ పాత్రలు పోటాపోటీగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ షాట్ కానీ, బ్లాస్ట్ లోనుంచి జంప్ చేసే షాట్ కానీ.. ఫ్యాన్స్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇద్దరు సైనికుల మధ్య భీకర యుద్ధం అన్నట్టుగా ట్రైలర్ కట్ ఉంది. టీజర్ తో పోలిస్తే ట్రైలర్ లో ఎన్టీఆర్ షాట్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఇక యాక్షన్ సీన్స్ లో అయితే ఎన్టీఆర్ డైనమైట్ లా కనిపిస్తున్నాడు. హృతిక్ కళ్ళలోకి ఎన్టీఆర్ కళ్ళుపెట్టి చూసే షాట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది అనడంలో డౌట్ లేదు. "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన" అనే భగవద్గీత శ్లోకంతో హృతిక్-ఎన్టీఆర్ ల మధ్య ఫైట్ తో ట్రైలర్ ను ముగించిన తీరు బాగుంది.
'వార్-2' టీజర్ చూసి కాస్త నిరాశచెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఇప్పుడు ట్రైలర్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా ట్రైలర్ కట్ ఉందని, కొన్ని షాట్స్ లో ఎన్టీఆర్ ని చూపించిన తీరు నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉందని సంబరపడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచే కాదు.. యాక్షన్ ప్రియుల నుంచి కూడా ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుత బజ్ చూస్తుంటే 'వార్-2' మూవీ రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



