మహావతార్ నరసింహ మూవీ రివ్యూ
on Jul 25, 2025
![]()
సినిమా పేరు: మహావతార్ నరసింహ
తారాగణం: శ్రీ మహావిష్ణువు, నరసింహుడు, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, శుక్రాచార్యుడు, కయాదు, హోళికా తదితరులు
మ్యూజిక్ : సామ్ సి ఎస్
ఎడిటర్: అశ్విన్ కుమార్
రచన, దర్శకత్వం: అశ్విన్ కుమార్
నిర్మాతలు: విజయ్ కిరంగదుర్, శిల్పాధావన్, కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్
బ్యానర్ :హోంబులే ఫిల్మ్స్, క్లిమ్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: జూలై 25 ,2025
కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 ,కాంతార, సలార్ వంటి పలు చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న నిర్మాణ సంస్థ 'హోంబులే ఫిల్మ్స్'. ఈ రోజు 'మహావతార్ నరసింహ'(Mahavatar Narsimha) అనే యానిమేషన్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ
'కశ్యపు' మహర్షి దైవస్మరణలో ఉంటాడు. ఆ సమయంలో భార్య 'దితి' చేసిన తప్పు వల్ల 'హిరణ్యాక్షుడు', 'హిరణ్యకశప' అనే రాక్షస అంశతో కూడిన ఇద్దరు కవలల జననం జరుగుతుంది. ఆ ఇద్దరు పెద్దయ్యాక రాక్షస గురువు 'శుక్రాచార్యుడు'తో కలిసి అసుర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. విష్ణు నామాన్ని స్మరించే వాళ్ళని క్రూరంగా చంపుతుంటారు. వరాహా రూపంతో ఉన్న ఒక శక్తీ హిరణ్యాక్షుడుని సంహరిస్తుంది. దాంతో హిరణ్యకశపుడు మరింత శక్తులని సొంతం చేసుకొని ముల్లోకాలకి అధిపతిగా ప్రకటించుకొని పరిపాలన సాగిస్తుంటాడు. భార్య 'కయాదు' కడుపున 'ప్రహ్లదుడు' అనే బాలుడు జనియిస్తాడు. తన రాక్షస కులానికి వ్యతిరేకంగా పదిమంది పట్ల జాలి, దయ, ప్రేమని చూపిస్తు విష్ణు నామాన్నే తన శ్వాసగా చేసుకొంటాడు. దీంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ప్రహ్లాదుడు విషయంలో హిరణ్యకశిపుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? విష్ణువుపై హిరణ్యకశిపుడుకి ఎందుకు పగ? హిరణ్యాక్షుడు సోదరుడిని చంపిన వరాహం ఎవరు? హిరణ్యకశిపుడు శక్తులకి కారణం ఏంటి ? అసుర వంశానికి చెందిన ప్రహ్లాదుడుకి విష్ణు భక్తి ఏర్పడడానికి కారణం ఏంటి? ప్రహ్లాదుడిని విష్ణు ఏ విధంగా కాపాడాడు ? అసలు కశ్యపు' మహర్షి భార్య 'దితి' చేసిన తప్పేంటి? అపార శక్తుల్ని కలిగి ఉన్న హిరణ్యకశిపుడుని విష్ణువు ఏ విధంగా సంహరించాడు అనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్
ఈ చిత్ర కథ భారతీయ ఇతిహాసాల్లో పొందుపరిచి ఉండటం, గతంలో చాలా భాషల్లో సినిమాలుగా కూడా వచ్చి ఉండటంతో చాలా మందికి ఈ చిత్ర కథ తెలుసు. కానీ ఇప్పటి తరం కోసం మళ్ళీ తీసుకు రావడంతో చిత్ర బృందాన్ని తప్పకుండా అభినందించాల్సిందే. తెలుగులో భక్త ప్రహ్లాద గా వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. నేటికి ప్రతి ఒక్క విష్ణు భక్తుల ఇళ్లల్లో ఆ చిత్రంలోని పాటలు మారుమోగిపోతూనే ఉంటాయి. పైగా యానిమేషన్ చిత్రం అనే ఆలోచన కలగకపోవడం ఈ చిత్రం యొక్క స్పెషాలిటీ. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశపల జననానికి గల కారణంతో ఓపెన్ అయ్యి, సినిమాపై ఇంట్రస్ట్ కలిగించింది. కాకపోతే ఇతిహాసాల్లో కశ్యపు మహర్షి కి సంబంధించిన మరో అంశాన్ని కూడా చూపించి హిరణ్యాక్షుడు, హిరణ్యకశపల జనానికి గల కారణాల్ని మరింత లాంగ్ ప్రాసెస్ లో చూపించాల్సింది. పెరిగి పెద్దయిన ఆ ఇద్దరు విష్ణువు ని ఆరాధించే వాళ్ళని చంపడం దగ్గరనుంచి హిరణ్యాక్షుడు మరణం లాంటి సీన్స్ అన్ని బాగున్నాయి. ఆ తర్వాత
హిరణ్యకశపుడు ఘోర తపస్సు చేసే ప్రాసెస్ ని కూడా లెన్త్ లో చూపించాల్సింది. సెకండ్ హాఫ్ లో ప్రహ్లాదుడు ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి కథనం వేగంగా సాగింది. ప్రహ్లాదుడు రూపం కూడా చాలా చక్కగా కుదిరింది. నిజమైన ప్రహ్లాదుడు అలాగే ఉండేవాడు ఏమో అనేలా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చివరి అరగంట మూవీ మొత్తానికి హైలెట్.
సాంకేతిక నిపుణుల పని తీరు
'మహావతార్ నరసింహ' కి డైలాగులు చాలా బలాన్ని ఇచ్చాయి. ఒక మనిషి ఎలా జీవించాలో కూడా చెప్పిన ఆ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తాయి. ఇక ప్రతి క్యారక్టర్ కి చెప్పిన వాయిస్ కూడా అదనపు బలం. ముఖ్యంగా ప్రహ్లాదుడు కి చెప్పిన వాయిస్ వింటుంటే అమృతాన్ని సేవించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. 'నారసింహుడు' కి చెప్పిన వాయిస్ కూడా గంబీరంగా ఉండటంతో పాటు గూస్ బంప్స్ తెప్పించింది. విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. సామ్ సిఎస్(Sam cs) అందించిన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నభూతో న భవిష్యత్. అంతలా మెస్మరైజ్ చేసాడు. అశ్విన్ కుమార్(AshwinKumar), దర్శకత్వం,ఎడిటింగ్ కూడా బాగున్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే మూవీ లవర్స్ , విష్ణు భక్తులని 'మహావతార్ నరసింహ' ఆకట్టుకుంటుంది. యానిమేషన్ మూవీ అని అనిపించకపోవడం కూడా ఒక ప్రత్యేకత.
రేటింగ్ 2 . 5 / 5
అరుణాచలం
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



