ఎన్టీఆర్ డ్రాగన్ అప్డేట్.. అసలు ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడు?
on Jun 23, 2025
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. (NTR Neel)
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ పై ఒక పాటను షూట్ చేస్తున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అదిరిపోయే ట్యూన్ తో పవర్ ఫుల్ సాంగ్ ని స్వరపరిచాడట. ఇక ఈ పాటలో వచ్చే వందేమాతరం బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఈ సాంగ్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని చెబుతున్నారు.
ప్రశాంత్ నీల్ శైలిలో భారీ యాక్షన్ ఫిల్మ్ గా 'డ్రాగన్' తెరకెక్కుతోంది. ఇది గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో చైనా గ్యాంగ్‌స్టర్ జావో వీ జీవితం ఆధారంగా రూపొందుతోందని మొదటి నుంచి ఉన్న ప్రచారం. అంతేకాదు, ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా విదేశాల్లోనే ఉంటుందని కూడా మొదట్లో వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతోంది.
'డ్రాగన్' మూవీ షూటింగ్ హైదరాబాద్, మంగళూరులోనే ఎక్కువగా జరుగుతోంది. పైగా ఇప్పుడు హైదరాబాద్ లో సాంగ్ షూట్, వందేమాతరం బీజీఎం అనే వార్తలు మరింత ఆసక్తికరంగా మారాయి. నిజంగా ప్రశాంత్ నీల్ గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ మూవీనే చేస్తున్నాడా? లేక మరేదైనా కథ చేస్తున్నాడా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
