డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్.. ఆ ఎర్రచీర ఎవరిది!
on Jun 23, 2025
రోజాపూలు, ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, స్నేహితులు, లై, రావణుసుర వంటి పలు సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు శ్రీరామ్(Sriram) మలయాళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించి తన సత్తా చాటాడు. రీసెంట్ గా తమిళనాడులో సుదీర్ఘ కాలంగా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తు వస్తున్న 'అన్నాడిఏంకె' పార్టీకి చెందిన కార్యనిర్వాహక అధికారి ప్రసాద్ తో పాటు మరో ఇద్దరు 'డ్రగ్స్' కేసులో అరెస్ట్ అయ్యారు.
విచారణ సమయంలో 'శ్రీరామ్' తమ దగ్గర్నుంచి డ్రగ్స్ కొన్నట్టుగా ఆ ఇద్దరు చెప్పడం జరిగింది. దీంతో శ్రీరామ్ ని చెన్నై లో నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం రాజీవ్ గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలని సేకరించారు. ప్రస్తుతం 'నుంగం బాక్కం' పోలీస్ స్టేషన్ కి తరలించి పలు రకాల కోణాల్లో విచారిస్తున్నారు. శ్రీరామ్ అరెస్ట్ విషయం తమిళ, తెలుగు చిత్ర రంగాల్లో సంచనలంగా మారడంతో పాటు, ఇంకెవరెవరి పేర్లు బయటకి వస్తాయనే టెన్షన్ కూడా అందరిలో ఉంది.
శ్రీరామ్ 2002 వ సంవత్సరంలో 'రోజా కొట్టం' అనే సినిమాతో తమిళ చిత్ర రంగంలోకి ప్రవేశించాడు. భూమిక హీరోయిన్ గా చేసిన ఈ చిత్రమే 'రోజాపూలు' పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది.
మొదటి చిత్రంతోనే బెస్ట్ న్యూ యాక్టర్ గా 'తమిళనాడు' ప్రభుత్వం చేత అవార్డు అందుకున్నాడు. తెలుగు వాడైన శ్రీరామ్ ఇప్పటికి వరకు తన కెరీర్ లో హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 60 చిత్రాల దాకా చేసాడు. సొంత పేరు శ్రీకాంత్ కాగా సొంత ఊరు తిరుపతి. గత ఏడాది తెలుగులో 'వలరి' అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం 'ఎర్రచీర' అనే సినిమా చేస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
