జయం రవి భార్య గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
on Jun 24, 2023

జయం రవి భార్య పేరు ఆర్తి. ఆమె జయం రవి భార్యగానే కాదు, ఆర్తిగానూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ వైఫ్ అయితే ఎంత పనిచేసినా, స్టార్ వెలుగుల్లో వీళ్ల పనితనం కనిపించదు. ఆర్తి కూడా అంతే. ఆమెకంటూ ఎంత గుర్తింపు ఉన్నా, జయం రవి భార్యగానే ఆమె చూసేవారి సంఖ్య ఎక్కువ. అయినా, దాన్ని కూడా దాటుకుని సొంతంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆర్తి. ఆమె ఎంట్రప్రెన్యుయర్, ఇన్‌ఫ్లుయన్సర్. ఆమెకంటూ స్పెషల్ కెరీర్ ఉంది. ఇన్‌స్టా గ్రామ్‌లో 722కె ఫాలోయర్స్ ఉన్నారు. కోవిడ్ సమయంలో వారిలో చాలా మంది చేయూతకోసం ఎదురుచూశారు. అలాంటివారందరినీ ఒక తాటిమీదకు తీసుకొచ్చారు ఆర్తి. తనకున్న వనరులతో వాళ్లతో బిజినెస్ పెట్టారు. అంతే కాదు, రైజ్ 4 గర్ల్స్ కి ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లల చదువుకు సంబంధించి ఆమె కేర్ తీసుకుంటున్నారు.
తన భర్త జయం రవికి నైతిక మద్ధతు ఇవ్వడమే కాదు, ప్రొఫెషనల్‌గానూ ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. ఆయన ఇమేజ్ మేనేజ్‌మెంట్‌నీ, పబ్లిసిటీని, ఆర్థిక వ్యవహారాలను, సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ఆమే చూసుకుంటున్నారు. అంతే కాదు, అతను సినిమాల ఎంపికలోనూ ఆమె సహాయ సహకారాలు ఉంటున్నాయి.
తన భర్త బాగోగులే కాదు, కొడుకు ఆరవ్ పెంపకంలోనూ కీలక పాత్ర ఆర్తిదే. ఇన్ని రకాల పాత్రలు పోషించడం వెనుక తన తల్లి నేర్పిన అంశాలు ఉన్నాయని అంటారు ఆర్తి. ``మా అమ్మ పేరు సుజాత విజయ్‌కుమార్. ఆమె టీవీ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఆమె నాకు స్ఫూర్తి. ఆర్ట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ని పరిచయం చేశారు. బడ్జెట్‌లు అర్థం చేసుకోవడానికి సహకరించారు. ప్రొడక్షన్ లోనూ, లీడర్‌షిప్ స్కిల్స్ లోనూ మెళకువలు నేర్పారు. ఓ కంపెనీని ఎలా నడపాలో ఆమెను చూసే నేర్చుకున్నా`` అని అన్నారు ఆర్తి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



