‘నీ అయ్య నా మామ’ తో వస్తున్న రాహుల్ సిప్లిగంజ్!
on Jun 24, 2023

రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. ఒక గొప్ప సెలెబ్రిటీగా మారిపోయాడు. ఇండస్ట్రీకి వచ్చి కొంతకాలమే అయిన మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ అయిపోయాడు. రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. 'మంగమ్మ' అనే ఫోక్ సాంగ్ ని రిమిక్స్ చేసి రాహుల్ పాడాడు. పాడటమే కాకుండా ఆ పాటలో నటించాడు. అప్పట్లో ఈ సాంగ్ మంచి క్రేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా రాహుల్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు.
అలా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు రాహుల్. ఆ తర్వాత బిగ్ బాస్-3 లో అవకాశం దక్కించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అందరితో సన్నిహితంగా ఉంటూ తనదైన శైలితో అందరిని ఆకట్టుకున్నాడు. దాంతో బిగ్ బాస్ సీజన్-3 లో విజేతగా నిలిచాడు రాహుల్. బిగ్ బాస్ తర్వాత రాహుల్ కి ఆఫర్స్ ఎక్కువగా రావడంతో బిజీ జీవితం గడుపుతున్నాడు.అయితే రాహుల్ తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీలో పాడిన 'నాటు నాటు' పాటకి ఆస్కార్ రావడం అందరికి తెలిసిందే..దాంతో అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడానికి రాహుల్ కొన్ని రోజులు దుబాయ్ కి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి బాగా ఎంజాయ్ చేసాడు. అయితే ఆ ఫ్రెండ్స్ లో అషురెడ్డి కూడా ఉండటంతో.. అషురెడ్డి తో రాహుల్ దిగిన ఫొటోస్ అప్పట్లో ఎంత వైరల్ గా మారాయో అందరికి తెలిసిన విషయమే.
సోహెల్ నటించిన 'బూట్ కట్ బాల్ రాజ్' సినిమాలోని "తాగుదాం తాగి ఊగుదాం" పాటని రాహుల్ సిప్లిగంజ్ పాడటంతో.. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాట ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. రాహుల్ సిప్లిగంజ్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసాడు. లేట్ నైట్ కూర్చొని మరొక సాంగ్ చేస్తున్నట్లు అందులో చెప్పాడు. కమింగ్ సూన్ అంటూ 'నీ అయ్య నా మామ' అనే ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ని చేస్తున్నట్టుగా పేర్కొన్నాడు. కాగా మరో సూపర్ హిట్ సాంగ్ రాబోతున్నట్టుగా మ్యూజిక్ లవర్స్ కి పండగే అన్నట్టు రాహుల్ చెప్పాడు. కాగా ఆ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని రాహుల్ ఫ్యాన్స్ వెయిట్ చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



