కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ రివ్యూ
on Jun 24, 2023

వెబ్ సిరీస్: కేరళ క్రైమ్ ఫైల్స్
నటీనటులు: అజు వర్గీస్, శ్రీజిత్ మహదేవన్, జిన్స్ షాన్, నవస్, సంజు, లాల్, రూత్ పి. జాన్, ఎ. ఆర్ రవిశంకర్ తదితరులు
కథ: ఆషిక్ ఐమర్
సినిమాటోగ్రఫీ: జితిన్ స్టనిస్లస్
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్
ఎడిటింగ్: మహేశ్ భువనేంద్
నిర్మాతలు: రాహుల్ రిజీ నాయర్
ప్రొడక్షన్ హౌజ్: ఫస్ట్ ప్రింట్ స్టుడియోస్
దర్శకత్వం: అహ్మద్ కబీర్
ఓటిటి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మలయాళంలో తీసిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'కేరళ క్రైమ్ ఫైల్స్' ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం
కథ:
కేరళలోని లాడ్జ్ లో ఒక హత్య జరుగుతుంది. ఆ లాడ్జ్ లో ఉన్న రిసెప్షనిస్ట్ శరత్(ఎ. ఆర్. హరిశంకర్) చూసి పోలీసులకి సమాచారమిస్తాడు. ఆ హత్య చేయబడిన మహిళ.. ఒక వేశ్య అని విచారణలో పోలీసులు తెలుసుకుంటారు. ఆ హత్య గురించి విచారణ జరుగుతుండగా ఆమెను హత్య చేసింది షిజు అని తెలుసుకుంటారు పోలీసులు. మరి ఆ షిజు దొరికాడా? అసలు ఆ వేశ్యని చంపింది అతనేనా? ఈ విచారణలో పోలిసులు కనిపెట్టారా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
లాడ్జ్ లో హత్యతో విచారణ మొదలవుతుంది. ఎస్ఐ మనోజ్ ప్రతీ ఒక్క క్లూని ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి సేకరిస్తాడు. అయితే విచారణలో ఒక్కో స్టేజ్ లో ఒక్కో పాత్ర తెరమీదకి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడీంగ్స్ లో భాగంగా ఒకానొక దశలో హత్యను చూసి పోలీసులకి సమాచారమిచ్చిన శరతే నేరస్థుడని భావిస్తారు పోలీసులు. అయితే ఈ సిరీస్ లో చాలా క్రైమ్ ఫైల్స్ కాకుండా ఒకే ఒక్క హత్య గురించి ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ జరుగుతుంటాయి. హత్య గురించి తెలిసాక పోలీసులు వివరాలు ఎలా సేకరిస్తారు. వారికి ఎదురయ్యే సమస్యలేంటని చాలా క్షుణ్ణంగా చూపించాడు డైరెక్టర్.
షుజి అసలు నేరస్తుడని తెలిసినా అతను ఎవరనేది చివరివరకూ రిలీల్ కాకుండా చాలా జాగ్రత్తపడ్డాడు డైరెక్టర్ అహ్మద్ కబీర్. బోల్డ్ సీన్స్ ఏమీ లేవు. అక్కడ అక్కడ కొన్ని అసభ్యకరమైన మాటలు తప్ప కథ మొదటి నుండి చివరివరకు ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది. క్లూస్ కోసం సాగే కథనం ఒక ఫ్లోలో వెళుతుంది. ఒక క్రైమ్ ఫైల్ కి ఇంత సమాచారం కావాలా అనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా చూపించాడు డైరెక్టర్. ప్రతీ ఎపిసోడ్ నిడివి కాస్త ఎక్కువ ఉంటుంది. అది మినహా ఎక్కడ బోర్ కొట్టదు. ఒక్కో ఎపిసోడ్ ఒక్క రోజు జరిగే ఇన్వెస్టిగేషన్ లాగా చూపించడం అందరికి నచ్చేస్తుంది. కానీ చివరి వరకు క్రైమ్ చేసినవాడిని చూపించకుండా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. సిరీస్ నిడివి తగ్గించి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కి కాస్త కత్తెర వేసుంటే ఇంకా బాగుండేది. వీకెండ్ లో ఒక క్రైమ్ థ్రిల్లర్ ని చూడాలనుకునేవారికి ఇదొక థ్రిల్ ని ఇస్తుంది.
చివరి ఎపిసోడ్ ఈ వెబ్ సిరీస్ కి ప్రాణం పోసింది. అయితే నిడివి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కరిని క్వశ్చనింగ్ చేస్తున్నప్పుడు పోలీసులు సుజీ వివరాలను సరిగ్గా చూడకపోవడమనేది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అప్పుడే జాగ్రత్త తీసుకుంటే కేస్ ఫైల్ ఎప్పుడో ముగిసిపోయేది. ఈ వెబ్ సిరీస్ కి హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన బిజిఎమ్ అదనపు బలాన్నిచ్చింది. ఆషిక్ ఐమర్ రాసిన కథని అహ్మద్ కబీర్ చక్కగా డైరెక్ట్ చేసాడు. మహేశ్ భువనేంద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. కానీ కొన్ని సీన్లకి కత్తెర వేస్తే కథ ఇంకా గ్రిస్పింగ్ గా ఉండేది. జితిన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణవిలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
ఎస్ఐ మనోజ్ గా అజు వర్గీస్ ఒదిగిపోయాడు. శరత్ గా హరి శంకర్ ఆకట్టున్నాడు. సీఐ కురియన్ గా లాల్.. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు. మిగిలిన వారు వారి పాత్రలకు తగ్గట్టుగా బాగా నటించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి మంచి ఎంగేంజింగ్ ని ఇచ్చే ఈ వెబ్ సిరీస్ అందరూ కలిసి చూడొచ్చు.
రేటింగ్: 2.5 / 5
✍🏻. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



