కార్తీ లుక్ అదిరిపోతుంది!
on Jan 24, 2023
తెలుగులో ఎంతో కొంత మార్కెట్ ఉన్న హీరోలుగా సూపర్ స్టార్ రజినీకాంత్, విక్రమ్, కమల్ హాసన్ ల తర్వాత సూర్య ఆయన సోదరుడు కార్తీలను గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. యుగానికి ఒక్కడు చిత్రంతో అందరికీ సుపరిచితులైన కార్తీ పలు విభిన్న చిత్రాలు చేస్తూ వస్తున్నారు. ఆ మధ్యన ఖైదీ అనే చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. కార్తీ ఇటీవల ఖాకీ, చిన్నబాబు, సర్దార్, దొంగ, సుల్తాన్, పొన్నియన్ సెల్వన్ 1వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాలకు మంచి రెస్పాన్స్ లభించింది. సర్దార్ మూవీతో సోలోగా బ్లాక్ బస్టర్ హిట్టు కొడితే పోనియన్ సెల్వన్ 1తో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాలో విక్రమ్ జయం రవి తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న క్యారెక్టర్ కార్తీదే కావడం విశేషం. అందులో ఓవైపు కామెడీని పండిస్తూనే మరోవైపు యాక్షన్ తో కూడా ఇరగదీశారు. ఇదిలా ఉంటే రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ జపాన్ అనే సినిమాలో నటిస్తున్నారు.
పీరియాడిక్ టచ్ తో పాటు కామెడీ యాక్షన్ త్రిల్లర్ గా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఇవి మూవీ నుంచి ఒక వెరైటీ లుక్ వచ్చింది. ఇక సంక్రాంతి సందర్భంగా చిత్ర నిర్మాతలు అయిన డ్రీమ్ వారియర్ సంస్థ మరో పోస్టర్‌ను విడుదల చేసింది. ఎర్రని దుస్తులను డిఫరెంట్ హెయిర్ స్టైల్లో పాత కాలంలో మెయిన్ విలన్ దగ్గర ఉండే గ్యాంగ్ విలన్ తరహాలో కనిపించారు. స్టైలిష్ గా నిలబడి సీరియస్ లుక్కుతో ఉన్న ఈ ఫోటో సినిమా ఎలా ఉండబోతుందో అని చెప్పకనే చెబుతుంది. ప్రేక్షకులు అద్యంతం నవ్వుకునే విధంగా ఈ మూవీ ఉండబోతుందని జపాన్ చిత్రంలోని కార్తీ లుక్కుని చూస్తేనే అర్థమవుతుంది. కోలీవుడ్‌లో కార్తీ అంటే మంచికి కామెడీ టైమింగ్ ఉన్న కథలు కనిపిస్తాయి. తెలుగులో కూడా ఊపిరి సినిమాలో కార్తీక్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనమందరం టెస్ట్ చేశాం. ఇప్పుడు జపాన్‌లో ఫుల్ లెన్త్ కామెడీ యాక్షన్ హీరోగా ఆయన రాబోతున్నారు. మరి ఆయన ఏవిధంగా ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది వేచి చూడాలి. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
