జానీమాస్టర్ కి అవకాశాలు ఇప్పిస్తుంది ఎవరు!ఇదెక్కడి మాస్ రా బాబు
on Oct 8, 2025

హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా హీరోల చేత స్టెప్ లు వేయించి అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేయడంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ 'జానీమాస్టర్'(Janimaster)కూడా ఒకరు. తెలుగులో ఉన్న అగ్ర హీరోలందరు ఆయన నృత్య దర్శకత్వంలో చేసిన వాళ్లే. గత సంవత్సరం కో డాన్సర్ శ్రేష్టివర్మ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసింది. ఈ విషయంలో జానీమాస్టర్ పై కేసునమోదు కావడంతో పాటు కొన్నిరోజుల పాటు జైల్లో ఉన్నాడు.
బెయిల్ పై బయటకి వచ్చిన జానీ మాస్టర్ కి బడా హీరోల సినిమాల్లో ఆఫర్స్ రావనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినిపించాయి. కానీ జానీ మాస్టర్ ఈజ్ బ్యాక్ అనేలా తన కెరీర్ దూసుకుపోతుంది. గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)కెరీర్ లో ప్రెస్టేజియస్ట్ మూవీగా తెరకెక్కుతున్న 'పెద్ది'(Peddi)కి జానీ మాస్టర్ వర్క్ చేస్తున్నాడు. చరణ్ క్యారక్టర్ కి సంబంధించిన ఎలివేషన్ ని తెలిపే టైటిల్ సాంగ్ తో పాటు పక్కా మాస్ సాంగ్ అనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో స్టెప్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజ(Ravi Teja)అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర' (Mass jathara)నుంచి 'ఓలే ఓలే'(Ole Ole)అనే శ్రీకాకుళం జానపద స్టైల్ తో సాగే పక్కా మాస్ సాంగ్ రిలీజయ్యింది.
లిరిక్స్ ఉర్రూతలూగించే విధంగా ఉన్నాయి. ఈ సాంగ్ కి కూడా జానీ మాస్టర్ నే నృత్య దర్శకుడు. సాంగ్ ప్రోమోలో రవితేజ వేసిన స్టెప్స్ చూస్తే ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ రెండు సాంగ్స్ తో జానీ మాస్టర్ మళ్ళీ తెలుగు సినిమా పరిశ్రమలో తన సత్తా చాటడం ఖాయమని తనకున్న టాలెంట్ వల్లే మళ్ళీ బడా హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



