ఆహా.. ఆచార్య ఆడియో రైట్స్
on Jan 5, 2021

మెగాస్టార్ చిరంజీవి, మెలోడీ బ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ గా మెప్పించాయి. బావగారూ బాగున్నారా, చూడాలని వుంది, అన్నయ్య, ఇంద్ర లాంటి సినిమాలైతే ఆడియో సేల్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టించాయి. అలాంటి ఈ కాంబోలో.. దాదాపు ఒకటిన్నర దశాబ్దం విరామం అనంతరం వస్తున్న చిత్రం ఆచార్య. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సోషల్ డ్రామా.. వేసవిలో విడుదల కానుంది.
కాగా, ఈ లోపే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ ని ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్.. ఆహా అనిపించే రేటుకి కొనుగోలు చేసిందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఆచార్య గీతాల హక్కులు రూ.4 కోట్ల వరకు పలికాయని పరిశ్రమ వర్గాల సమాచారం. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఆచార్యలో చిరుతో పాటు ఆయన తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. చిరుకి జోడీగా కాజల్ దర్శనమివ్వనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



