గ్యారేజ్ సూపర్ అన్న సింధు, గోపిచంద్
on Sep 12, 2016

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ రికార్డులు, కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే 60 కోట్ల మార్క్‌ను దాటిన గ్యారేజ్ 100 కోట్ల వైపు వేగంగా పరిగెడుతోంది. ఈ సినిమాను చూసిన విక్టరీ వెంకటేశ్ చిత్ర యూనిట్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. తాజాగా మరో కాంప్లిమెంట్ చిత్ర యూనిట్‌ను ఆనందంలో ముంచెత్తుతోంది. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపిచంద్‌లు జనతా గ్యారేజ్ సినిమాని తిలకించారు. ప్రసాద్ లాబ్స్ లో సినిమాని చూసిన వీరు చిత్ర బృందాన్ని అభినందించారు. ముఖ్యంగా మోహన్‌లాల్, ఎన్టీఆర్, కొరటాల శివలను ఆకాశానికెత్తేశారు.
పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, " సినిమా చాలా బాగుంది. మంచి కథా బలం ఉన్న సినిమా. ఎన్టీఆర్, మోహన్ లాల్ ల నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇంత మంచి చిత్రాన్ని అందించిన చిత్ర బృందానికి, దర్శకులు కొరటాల శివ గారికి కంగ్రాట్యులేషన్స్" అని అన్నారు.
పీవీ సింధూ మాట్లాడుతూ, " నేను జనతా గ్యారేజ్ సినిమా ని బాగా ఎంజాయ్ చేశాను. ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కంగ్రాట్స్ టు ది టీం", అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



